Friday, April 4, 2025

మయన్మార్ లో మళ్లీ భూకంపం..

- Advertisement -
- Advertisement -

మయన్మార్‌లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది గాయపడగా… 500 మంది ఆచూకీ గల్లంతైంది. అయితే, ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే మరోసారి భూకంపం సంభవించింది. దీంతో మరోసారి భారీ శబ్దాలతో ఆ దేశం ఉలిక్కిపడింది. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అధికారుల నివేదిక ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News