Wednesday, January 22, 2025

సిక్కింలో 4.3 తీవ్రతతో భూకంపం!

- Advertisement -
- Advertisement -
యుక్సోమ్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు

గాంగ్టక్: సిక్కింలో సోమవారం తెల్లవారు జామున 4.3 తీవ్రతతో ఉన్న భూకంపం సంభవించింది. భూకంప జాతీయ కేంద్రం(నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) ఈ విషయాన్ని తెలిపింది. తెల్లవారు జామున 4.15 గంటలకు సిక్కిం పశ్చిమ జిల్లా యుక్సోమ్ వాయువ్యంలో దాదాపు 70 కిమీ. దూరంలో ఈ భూకంపం సంభవించింది. యుక్సోమ్ పట్టణం పరిసరాలలో ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని కూడా వారు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News