- Advertisement -
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి 7.30గంటల సమయంలో క్యుషు కోస్టల్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది.
మరోవైపు మయన్మార్ దేశంలో భారీ భూకంపం పెను విధ్వంసమే సృష్టించింది. గత శుక్రవారం మయన్మార్ లో సంభవించిన భూప్రకంపనల కారణంగా దాదాపు మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 5 వేల మంది గాయపడ్డారు.వందల మంది ప్రజలు నిరాశ్రులయ్యారు.పెద్ద ఎత్తున ఇండ్లు కుప్పకూలిపోయాయి.
- Advertisement -