తిరువనంతపురం: ఈ రోజు ఉదయం 8:15 గంటలకు కేరళలోని త్రిసూర్ లో 3.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) పేర్కొంది.
నాలుగు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు త్రిసూర్ జిల్లా అధికారులు పిటిఐకి తెలిపారు. అయితే, నష్టం లేదా గాయాలకు సంబంధించి ప్రస్తుతానికి రిపోర్టులు లేవు.
దేశంలో భూకంప కార్యకలాపాల పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎన్ సిఎస్ , భూకంప కేంద్రం అక్షాంశం 10.55 N , రేఖాంశం 76.05 E వద్ద ఏడు కిలోమీటర్ల లోతుతో ఉందని ‘X’ వేదికలో పోస్ట్ చేసింది.
ఇదిలావుండగా, కున్నంకుళం, ఎరుమపెట్టి, పజాంజీ ప్రాంతాలు, పాలక్కాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర జియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇతరులు సంఘటనపై మరింత అధ్యయనం చేయడానికి ఆ ప్రాంతాలకు వెళ్లారు.
EQ of M: 3.0, On: 15/06/2024 08:15:26 IST, Lat: 10.55 N, Long: 76.05 E, Depth: 7 Km, Location: Thrissur, Kerala.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/r9a0IRoq4w— National Center for Seismology (@NCS_Earthquake) June 15, 2024