Wednesday, April 2, 2025

గుజరాత్‌లోని అమ్రేలిలో 3.1 తీవ్రతతో భూకంపం!

- Advertisement -
- Advertisement -

అమ్రేలి: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సావర్‌కుండ్లా తాలూకాలో గురువారం 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదయింది. ఈ విషయాన్ని భూకంప పరిశోధన సంస్థ(ఐఎస్‌ఆర్) అధికారి తెలిపారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని ఆ అధికారి తెలిపారు. అమ్రేలికి దక్షిణ ఆగ్నేయంగా 44 కిమీ. దూరంలో సావర్‌కుండ్ల తాలూకాలోని మితియాలా గ్రామం వద్ద 6.2 కిమీ. లోతులో ఈ ప్రకంపనలు నమోదైనట్లు గాంధీనగర్‌కు చెందిన ఐఎస్‌ఆర్ అధికారి వివరించారు.

ఫిబ్రవరి 19న సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలోని ఖంభా ప్రాంతంలో 2.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని ఐఎస్‌ఆర్ తెలిపింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా, సౌరాష్ట్ర ప్రాంతంలో కూడా ఉంది. అక్కడ జనవరి 2001లో వినాశకర భూకంపం సంభవించింది. అప్పట్లో 13800 మంది మరణించారు, మరో 1.67 లక్షల మందికి గాయాలయ్యాయి. నాటి భూకంపం ధాటికి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ఆస్తి నష్టం సంభవించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News