- Advertisement -
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. మండి పట్టణానికి సమీపంలో ఉదయం 9.18 గంటలకు సంభవించిన భూకంపం లోతు 5 కిమీ. అని వాతావరణ శాఖ తెలిపింది. మండి ప్రాంతంలో 31.49 డిగ్రీల అక్షాంశం, 76.94 డిగ్రీల రేఖాంశంలో భూకంప కేంద్రం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోనూ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మండి జిల్లా భూకంప జోన్ 5 కిందకు వస్తుంది, ఇది అధిక నష్టం కలిగించే జోన్ అనే చెప్పాలి.
- Advertisement -