Sunday, December 29, 2024

మణుగూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదు

- Advertisement -
- Advertisement -

మణుగూరు: మణుగూరు సింగరేణి పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం సుమారు 4.40నిమిషాల సమయంలో భూమి ఒక్క సారిగా కంపించడంతో ఇంట్లో ఉన్న సామాన్లు క్రింద పడడంతో ప్రజలు భయబ్రాంతులకు గైరు రోడ్లపైకి పరుగులు తీసారు. మణుగూరులో సంభవించిన భూ కంపనాలను అధికారులు భూకంపంగా నిర్ధారించారు. భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

భూమిలోపల సుమారు 30 కిలోమీటర్ల లోతులో కుదుపులకు గురైనట్లు వారు వెల్లడించారు. మణుగూరు ప్రాంతంలో గతంలో ఎప్పుడు లేనివిదంగా గత వారం రోజుల్లో రెండు సార్లు భూమి కంపిచడంతో ప్రజలకు ఆందోళన చేందుతున్నారు. మణుగూరు ప్రాంతంలో సింగరేణి సంస్ధ అధికంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని పరిమితికి మించి ఒబి వెలికితీతకు బ్లాస్టింగ్ నిర్వహిస్తుండటం కారణంగానే భూమిలో ప్రకంపనలకు కారణమై ఉండోచ్చని పలువురు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News