Monday, January 20, 2025

బాలి తీరంలో భూకంపం..

- Advertisement -
- Advertisement -

డెన్‌పసార్ (ఇండోనేషియా) : ఇండోనేషియా లోని బాలి సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్డర్ స్కేలుపై 7.0 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మతారామ్‌కు ఉత్తరాన 201 కిమీ దూరంలో భూకంప కేంద్రీకృతమైందని పేర్కొంది. భూ అంతర్భాగంలో 518 కిమీ దిగువన కదలికలు సంభవించాయని వివరించింది. అయితే భూకంప తీవ్రత 7.1 గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ 6.5 తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News