- Advertisement -
నేపిడా: మయన్మార్ దేశంలో భూకంపాలతో అతలాకుతలం అవుతోంది. ప్రతీ రెండు గంటలకు ఒకసారి భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం నుంచి కోలుకొనే అవకాశం కూడా ఇవ్వడం లేదు. గడిచిన 24 గంటల్లో 15 సార్లు భూమి కంపించింది. దీని కారణంగా ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు భవనాలు, వంతెనలు నేలమట్టం అయ్యాయి. 1934లో నిర్మించిన చారిత్రక అవా వంతెన భూకంపం కారణంగా కుప్పకూలిపోయింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ పగోడా ఆలయం కూడా శిథిలమైంది. అయితే ఇప్పటికే భారత్ మయన్మార్‌కు అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. బాధితులకు సహాయాన్ని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ఇప్పటికే ప్రారంభించింది.
- Advertisement -