- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. అక్టోబర్ 3న తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు రాగా, తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదివారం మధ్యాహ్న సమయంలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి బలంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.08 గంటల సమయంలో ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానా లోని ఫరీదాబాద్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1 గా నమోదైనట్టు జాతీయ భూకంప కేంద్రం పేర్కొంది.
- Advertisement -