Tuesday, March 4, 2025

ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానితో పాటు పరిసర ప్రాంతాలలో గురువారం భూప్రకంపనలు సంభవించాయి. అప్ఘానిస్తాన్ సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దాని ప్రకంపనలు ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కనిపించాయని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. అఫ్ఘానిస్తాన్ సమీపంలో సంభవించిన భూప్రకంపనల ప్రభావం పాకిస్తాన్‌లోని లాహోర్‌తోపాటు, జమ్మూ కశ్మీరులోని పూంచ్, మరికొన్ని ప్రదేశాలలో కూడా కనిపించింది. భూప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎటువంటి సమాచారం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News