- Advertisement -
ధర్మశాల : హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూ కంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైందని భూ ప్రకంపనల జాతీయ కేంద్రం (ఎన్‌సిఎస్ ) తెలిపింది. ఇక్కడి ధర్మశాల సమీపంలో భూమి పొరలలో ఐదు కిలోమీటర్ల అడుగున భూమి కంపించింది. మరో వైపు శుక్రవారం మధ్యాహ్నం అరుణాచల్ ప్రదేశ్‌లో దక్షిణ ఛాంగ్లాంగ్‌లో కూడా భూమి కంపించింది. ఇక్కడ ప్రకంపనల తీవ్రత 4.2గా రికార్డు అయింది. ఈ వేర్వేరు ఒకేరోజు భూకంపాలతో ఏదైనా ప్రాణనష్టం, లేదా ఆస్తినష్టం వివరాలు వెల్లడి కాలేదు
- Advertisement -