Monday, January 20, 2025

భూమికి కవల గ్రహం “శుక్రుడు”

- Advertisement -
- Advertisement -

శుక్రగ్రహాన్ని శుభాశుభాలను సూచించే గ్రహంగా ఖగోళశాస్త్రవేత్తలు పరిగణిస్తుంటారు. ఇలా ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోడానికి నాసా శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. సూర్యునికి రెండో గ్రహంగా శుక్రుడు వెలువడినట్టు చెబుతుంటారు. అయితే ఈ గ్రహ వాతావరణాన్ని ఇతర లక్షణాలను పరిశోధించడానికి మూడు మిషన్లు ( నాసాకు చెందిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తల బృందాలు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ) శుక్రగ్రహంపై పరిశోధనలకు సిద్ధమౌతున్నాయి.

భూమికి, శుక్రగ్రహానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అయినా ఇంకా కొన్నిలక్షణాల్లో శుక్రగ్రహం భిన్నంగా ఉంటుంది. గ్రహం పైకి వెళ్లాలంటే ప్రారంభం లోనే హరిత వాయువుల ప్రభావాన్ని తట్టుకోవలసి వస్తుంది. కర్బన వాయువుల ఆధారిత 24 కిలోమీటర్ల ( 15 మైళ్లు) మేరకు దట్టంగా ఆవరించిన వాతావరణంలో గంధకామ్లం (సల్ఫూరిక్ యాసిడ్ )తో కూడిన మేఘాలు ఆవరించి ఉంటాయి. లోహం కరిగిపోయేటంత అత్యధిక ఉష్ణోగ్రత గ్రహం నుంచి వెలువడుతుంది.

గ్రహం ఉపరితలం 900 డిగ్రీల ఫారన్‌హీట్ ( 480 డిగ్రీల సెంటిగ్రేడ్) వరకు ఉంటుంది. అందువల్ల ఇది అపురూపమైన ఆసక్తి కలిగించే వింత గ్రహమని నాసా ప్లానెటరీ సైన్సు డైరెక్టర్ లోరి గ్లేజ్ వివరించారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా శుక్రగ్రహం, భూగోళం వేర్వేరుగా ఉన్నాయి? అన్న కోణంలో పరిశోధనలు సాగించాలని శాస్త్రవేత్తలు అనుకొంటున్నారు. మరో పది, పదిహేనేళ్లలో కనీసం మూడు మిషన్లయినా శుక్రగ్రహానికి చేరుకుంటాయని భావిస్తున్నారు.

ఉత్కృష్ట వాయువులు లేదా జడవాయువులుతో కూడిన గాఢవాతావరణంతో శుక్రగ్రహం ఆవరించి ఉంది. జడవాయువులు అంటే రసాయనిక చర్యలో పాల్గొనకుండా జడత్వంలో ఉంటాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రేడాన్‌లను జడవాయువులు అంటారు. వీటిని పరిశోధించాలన్నదే నాసా లక్షం. నాసా ప్రాజెక్టు రెండు విభాగాలుగా ఉంటుంది. మొట్టమొదటి విభాగంలో వ్యోమనౌక శుక్రగ్రహం మీదుగా సాగి, గ్రహ ఉపరితలం, వాతావరణ సమాచారం సేకరించి మిషన్‌కు అందిస్తుంది. రెండో భాగం శుక్రగ్రహం ఉపరితలంపై దిగుతుంది. గ్రహంపై ఆవరించి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పర్యావరణం లోపలికి ప్రవేశించి డేటాను సేకరిస్తుంది. మూడో మిషన్ “ఎన్విజన్‌”. ఈ మూడు మిషన్లు కలిసి శుక్రగ్రహ విశేషాలను మనకు అందిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News