Wednesday, January 22, 2025

తూర్పుకోస్తా రైల్వే పరిధిలో 75 రైళ్లు రద్దు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్డులో మూడోలైన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాసప్పర్, -ధన్మండల్ సెక్షన్‌లో ముందస్తు ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల పూర్తి రద్దు మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఈ మేరకు రద్దయిన రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. ఆగస్టు 21వ తేదీ నుంచి 29 వరకు వివిధ తేదీల్లో మొత్తం 75 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. మరోవైపు, భువనేశ్వర్, ముంబై హావ్-, సికింద్రాబాద్ టు భువనేశ్వర్- టు సికింద్రాబాద్‌ల మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులు ఆగస్టు 24వ తేదీ నుంచి 30 వరకు పలు తేదీల్లో భువనేశ్వర్‌కు బదులుగా ఈ రోడ్ నుంచే అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News