Monday, January 20, 2025

ప్రేమపెళ్లి…. నడిరోడ్డులో భార్యను కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు… దొంగతనం కేసులో జైలుకెళ్లాడు.. దీంతో భార్య విడాకులు ఇస్తానని చెప్పడంతో ఆమెను భర్త కత్తితో పొడిచి చంపిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆకివీడులో సంధ్య, రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 18 నెలల కుమారుడు ఉన్నాడు. ఇదే సమయంలో గొలుసు దొంగతనం చేసిన కేసులో రాంబాబు జైలుకు వెళ్లడంతో సంధ్య తన పుట్టింటికి వెళ్లి విడాకులు ఇస్తానని సమాచారం ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన రాంబాబు ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.

Also Read: చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

సంధ్య తన తండ్రితో కలిసి భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారిని రాంబాబు అడ్డుకున్నాడు. కత్తి తీసుకొని సంధ్యను పలుమార్లు పొడిచాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కొంచెం దూరంలో ఉన్న తండ్రి అతడిని అడ్డుకోలేకపోయాడు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. వెంటనే ఆమె భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆమె బంధువులు, స్థానికులు మృతదేహంతో పాటు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డిఎస్‌పి, ఆర్‌డిఒలు అక్కడికి చేరుకొని మృతురాలు కుమారుడికి న్యాయం చేయడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కితగ్గారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం బీమవరం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News