Monday, December 23, 2024

మోసం చేశాడని ప్రియుడ్ని కత్తిపీటతో నరికిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించిన వ్యక్తి తనన మోసం చేయడంతో పాటు దక్కడం లేదని ప్రియుడిని ప్రియురాలు కత్తి పీటతో నరికి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన డిబేరాతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగశేషు(25)తో చదువుకునేటప్పుడు పరిచయం ఉంది. నాగశేషు (25) భవన నిర్మాణంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఇద్దరు మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో అప్పుడప్పుడు కలుసుకుంటారు. నాగశేషు తన అవసరాల నిమిత్తం డిబేరా వద్ద రెండు లక్షల రూపాయలతో పాటు బంగారు గొలుసు తీసుకున్నాడు.

నాగశేషు కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారం తెలియడంతో వెంటనే అతడి మరో యువతికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన సంవత్సరం తరువాత ఈ విషయం డిబేరాకు తెలియడంతో తన డబ్బులు ఇవ్వాలని నాగశేషును బలవంతం చేసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ప్రేమ వ్యవహారంలో తనని మోసం చేశాడని యువతి గ్రహించి మరో వ్యక్తి శివనారాయణతో కలిసి చంపాలని నిర్ణయం తీసుకుంది. ప్రియుడి ఇంటికి శివనారాయణతో పాటు డిబేరా వెళ్లింది. ప్రియుడితో ప్రియురాలు గొడవకు దిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి పీటతో నాగశేషుపై డిబేరా దాడి చేసింది. అడ్డుకోబోయిన ప్రియుడి తల్లిని శివ కర్రతో బాదడంతో ఆమె అక్కడే పడిపోయింది. వెంటనే శివ, అతడి తల్లిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రియుడు అప్పటికే చనిపోయారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: డ్రోన్లతో విధ్వంసానికి కుట్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News