Monday, January 20, 2025

భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్యపై అనుమానంలో ఆమెను భర్త కత్తెరతో పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శెట్టిపేటకు చెందిన చిరంజీవికి, అన్నవరపాడుకు చెందిన నవ్యకు 2013లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. చిరంజీవి తాపీ మేస్ట్రీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానం ఉండడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను చిరంజీవి మిషన్ కత్తెరతో పొడిచి హత్య చేశారు. కూతుర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News