Thursday, January 23, 2025

కరెంట్ షాక్… నలుగురి ప్రాణం తీసిన ఫ్లెక్సీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ వైరు తగలడంతో నలుగురు మృతి చెందారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు అని తెలిపారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడిపర్రు గ్రామం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో నలుగురు చనిపోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News