Monday, January 20, 2025

ప్రియుడితో ఛాటింగ్.. వివాహితను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన ప్రియుడితో చాటింగ్ చేస్తోందని ఓ వివాహితను ఓ మహిళ కారులో కిడ్నాప్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోకవరం గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో ఛాటింగ్ చేస్తోందని కొవ్వూరుకు చెందిన మహిళ అనుమానం పెంచుకుంది. సదరు వివాహిత పగ పెంచుకొని ఏదో ఒకటి చేయాలని నిర్ణయం తీసుకుంది. మరో మహిళను తీసుకొని కారులో ప్రియురాలు గోకవరం చేరుకుంది. అదే గ్రామంలో మరో మహిళతో కలిసి వివాహితను కారులో కిడ్నాప్ చేశారు. వెంటనే ఆమె భర్త గమనించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు సాంకేతిక ఆధారంగా కారు ఉన్న ప్రదేశానికి చేరుకొని వారిని పట్టుకున్నారు. వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News