Tuesday, December 24, 2024

ఖానాపురం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఈస్ట్ జోన్ డిసిపి

- Advertisement -
- Advertisement -

ఖానాపురం: ఖానాపురం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిషన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు పీఎస్‌లో ఉన్న సన్నిహిత రిసెప్షన్ ఉమెన్ పీసీ సరితను పెండింగ్‌లో ఉన్న పిటీషన్లు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం పీఎస్ రైటర్‌తో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు. అలాగే పీఎస్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. రాబోయే ఎన్నికల ముందు జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం పీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News