Wednesday, January 22, 2025

గజ్వేల్ ఎన్నికలపై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్: గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు.

గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సభ పెట్టుకోవచ్చునని ఈటల అన్నారు. అయితే బీజేపీ నిర్వహించే సమావేశాలకు ప్రజలను రానీయకుండా చేసేందుకు బీఆర్‌ఎస్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల ఆరోపించారు. డబ్బులు ఇచ్చి ఆహ్వానాలు ఇవ్వకుండా ఆపుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే రీతిలో జరిగింది. కానీ హుజూరాబాద్ ప్రజలు ఈ ప్రలోభానికి లొంగకుండా ఉద్యమ బిడ్డకు న్యాయం చేశారు. ఈసారి గజ్వేల్‌లోనూ అదే జరగనుంది. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్ ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News