- Advertisement -
వాషింగ్టన్ : ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాలను కలవరపెడుతోంది. 2020 లో వందల మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడిందని ప్రకటించిన ఐదు నెలల తరువాత తూర్పు కాంగోలో కొత్త కేసు నమోదైంది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. మూడేళ్ల చిన్నారిలో కరోనా లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. అక్టోబర్ 6 న ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. కొవిడ్ సహా ఈ ప్రాంతంలో అంటువ్యాధుల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. సమర్ధ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర నిఘా సన్నద్ధత ఆవశ్యకమని సూచిస్తున్నారు.
- Advertisement -