- Advertisement -
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికలలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు- ఉమ్మడి గుర్తు కేటాయింపునకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే టిఆర్‌ఎస్ (తెలంగాణ రాజ్య సమితి) పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ కేటాయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు వర్తింపజేసే ఫారం 10బి అందజేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి గుర్తును కేటాయించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ తరుపున 119 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుగా గ్యాస్ సిలిండర్ కేటాయించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -