Friday, November 22, 2024

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఇసి

- Advertisement -
- Advertisement -

Delimitation commission to visit J&K from july 6 to 9

మనతెలంగాణ/హైదరాబాద్: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణను చేపట్టనుంది. 2021 నవంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణను చేపట్టి, నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు ఇసి అవకాశం కల్పించింది. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, వినతుల పరిష్కారం కల్పిస్తామని ప్రకటించింది. 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ ప్రచురించనున్నట్లు తెలిపింది. జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించనుంది. 2022 జనవరి 1నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటుహక్కుకు అర్హులని పేర్కొంది. www.nvsp.in ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News