- Advertisement -
హర్యానా: పంజాబ్ రాస్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 117 స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, గురు రవిదాస్ జయంతి ఉత్సవాల కారణంగా ఎన్నికలను వారం రోజులపాటు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కాంగ్రెస్ తోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరడంతో ఈసి సోమవారం కొత్త ఎన్నికల తేదీని ప్రకటించింది. అన్ని పార్టీలు వినతుల మేరకు ఆరు రోజుల తర్వాత ఫిబ్రవరి 20న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసి వెల్లడించింది.
EC Announces Punjab Polls to held on Feb 20
- Advertisement -