న్యూఢిల్లీ: ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి సంఘ వ్యతిరేక శక్తులు మోటార్ సైకిళ్లను ఉపయోగించనున్నారని వార్తలు వచ్చిన దరిమిలా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నఐదు రాష్ట్రాలలోని అన్ని నియోజకవర్గాలలో పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచి లేదా పోలింగ్ రోజున బైకు ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. పోలింగ్‌కు ముందు లేదా పోలింగ్ రోజున ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని ప్రాంతాలలో బైకులను ఉపయోగించనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరికి చెందిన ప్రధాన ఎన్నికల అధికారులకు పంపిన ఒక ఆదేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ వార్తలను పరిశీలించిన తర్వాత ఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాలలో పోలింగ్‌కు ముందు 72 గంటల ముందు నుంచి లేదా పోలింగ్ రోజున బైకు ర్యాలీలను నిషేధించాలని నిర్ణయించినట్లు కమిషన్ తెలిపింది. ఈ ఆదేశాలను కచ్ఛితంగా పాటించాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీలతోసహా ఎన్నికల సంబంధీకులు అందరినీ ఆదేశించాలని ప్రధాన ఎన్నికల అధికారులను ఇసి ఆదేశించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు మార్చి 27న పోలింగ్ మొదలు కానున్నది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనున్నది.
EC Bans Bike Rallies 72 hrs before Voting