- Advertisement -
బెంగళూరు : రాష్ట్రంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. బజరంగదళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినందుకు నిరసనగా మంగళవారం హనుమాన్ చాలీసా పఠనానికి బీజేపీ సిద్ధం కాగా ఎన్నికల కమిషన్ అడ్డుకుంది.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సీఆర్‌పిసి 144 సెక్షన్ విధించినందున విహెచ్‌పి సభ్యులు హనుమాన్ చాలీసా పఠించకుండా ఆపించింది. విజయ్‌నగర్ లోని ఒక ఆలయం వెలుపల ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి లేదని విహెచ్‌పి సభ్యులను ఈసీ అడ్డుకుంది. విహెచ్‌పి సభ్యులు ఆపకుండా తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
- Advertisement -