- Advertisement -
హైదరాబాద్: వివిధ రాష్ట్రాల శాసనసభల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించొద్దని ఎన్నికల సంఘం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల సార్వత్రిక, నాగాలాండ్ ఉప ఎన్నికల దృష్టా ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 7వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి నవంబరు 30వ తేదీ సాయంత్ర 6.30 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్‌ను ప్రచురించడం, ప్రసారం చేయోద్దని సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని ఇసి పేర్కొంది.
- Advertisement -