Sunday, January 19, 2025

లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు…ఈవిఎంల తొలి స్థాయి చెకింగ్!

- Advertisement -
- Advertisement -
తొలి స్థాయి చెకింగ్ ప్రక్రియలో భాగంగా ‘మాక్ పోల్స్’

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వినియోగించనున్న ఈవిఎం, పేపర్‌ట్రయిల్ మెషిన్ల తొలి దశ చెకింగ్ ప్రక్రియను మొదలెట్టారని అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశ చెక్ ప్రక్రియలో భాగంగా ‘మాక్ పోల్స్’ నిర్వహిస్తారని వారు తెలిపారు. దశల వారీగా ఈ తొలి దశ చెక్ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపడతారు. కేరళలోని వాయ్‌నాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ మాక్ పోల్ జరుగుతున్నట్లు అధికారి తెలిపారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవడంతో ఈ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది.

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో…తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మఝధ్యప్రదేశ్ కూడా ఈ తొలి దశ చెక్ చేపట్టనున్నారు. ప్రస్తుతం వాయనాడ్, పుణే, ఛంద్రపూర్, ఘాజీపూర్, అంబాల లోక్‌సభ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
తొలి దశ చెక్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, పేపర్‌ట్రయల్ మెషిన్లను రెండు ప్రభుత్వ సంస్థలైన బిఈఎల్, ఈసిఐఎల్ చెక్ చేస్తాయి. పాడయిన మెషిన్లను రిపేర్ కోసం తయారీదారు వద్దకు పంపుతారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే మెషిన్లను చెక్ చేయడానికి మాక్ పోల్ నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News