Friday, November 15, 2024

అది ఫేక్ మెస్సేజ్: ఎన్నికల కమిషన్

- Advertisement -
- Advertisement -
  • వాట్సప్ మెస్సేజిల ద్వారా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరగదు
  • మీడియా సమావేశాల్లోనే ప్రకటిస్తారు
  • ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ పత్రికా సమావేశం ద్వారా ప్రకటించడం జరుగుతుందే తప్ప టెక్స్, వాట్సప్ మెసేజీలద్వా కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఎన్నికల కమిషన్ పేరిట ఒక ఫేక్ మెస్సేజ్ సర్కులేట్ అవుతూ ఉండంతో ఎన్నికల కమిషన్ ఈ స్పష్టతను ఇచ్చింది.

ఆ ఫేక్ మెస్సేజిలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మార్చి 12న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం జరుగుతుందని, అదే రోజునుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని పేర్కొంది. అలాగే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 28గా దానిలో పేర్కొన్నారు. ఏప్రిల్ 19న పోటింగ్ జరుగుతుందని, మే 22న ఫలితాలను ప్రకటిస్తారని కూడా ఆ ఫేక్ మెస్సేజ్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ లెటర్‌హెడ్‌తో ఉన్న ఆ మెస్సేజ్ గత రెండు రోజులుగా వాట్సాప్ గ్రూపులలో సర్కులేట్ అవుతూ వస్తోంది. అయితే సాధారణ ఎన్నికలు ఒకే రోజు ఎలా నిర్వహిస్తారంటూ చాలా మంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై గందరగోళానికి తెరదించుతూ ఎన్నికల కమిషన్ వైరల్ అవుతున్న ఆ మెస్సేజ్ బూటకపు మెస్సేజ్ అని శనివారం ఒక వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి తేదీలను ప్రకటించలేదని ఇసి ఎక్స్(ట్విట్టర్)లో ఉంచిన ఒక పోస్టులో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News