Sunday, January 19, 2025

రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేదీ నంబర్ 25కి మార్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 25వ తేదీకి మారుస్తున్నట్లు ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగవలసి ఉంది.

నవంబర్ 23న భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నందున ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ మార్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ జరగాల్సిన రోజునే దాదాపు 50,000 పెళ్లిళ్లు జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. దీని వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదన్న భావనతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News