Monday, December 23, 2024

కర్నాటక బిజెపి యానిమేషన్ వీడియోను తీసేయాలని ఈసి ఎక్స్ ని ఆదేశించింది

- Advertisement -
- Advertisement -

ముస్లిం రిజర్వేషన్లపై కర్ణాటక బిజెపి షేర్ చేసిన యానిమేషన్ వీడియోను తీసివేయాలని ఎన్నికల సంఘం ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు)ని ఆదేశించినట్లు వార్తా సంస్థ పిటిఐ మంగళవారం పేర్కొంది. మే 4న, కాంగ్రెస్‌పై దాడి చేయడానికి ముస్లిం వ్యతిరేక వాక్చాతుర్యంతో రిజర్వేషన్లపై యానిమేషన్ వీడియోను కర్ణాటక బిజెపి పోస్ట్ చేసింది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ , ఓబిసిల వాటాను ముస్లింలకు కాంగ్రెస్ ఇస్తుందని సూచించింది.

దీనికి సంబంధించిన వీడియోను కర్ణాటక బిజెపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ(కాంగ్రెస్) ఎస్సీ, ఎస్టీ, బిసి సంపదను చీల్చడం ద్వారా ముస్లింలకు పంచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందన్న బిజెపి వాదనకు అనుగుణంగా ఈ వీడియో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను టార్గెట్ చేసింది.

Muslims

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News