Sunday, January 19, 2025

ఎంఎల్‌సి ఎన్నికలకు కసరత్తు

- Advertisement -
- Advertisement -
  • దరఖాస్తు తుది గడువు నవంబర్ 6
  • మార్చిలో ముగియనున్న ముగ్గురు ఎంఎల్‌సిలు జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన ఖాళీ కానున్న మూడు ఎంఎల్‌సి స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిల పదవీ కాలం 2025 మార్చి 29తో పూర్తి కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం మొదలు పెట్టింది. నవంబర్ 1న కటాఫ్ (క్వాలిఫైయింగ్) డేట్‌గా పెట్టుకుని ఓటర్ల జాబితాను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

ఈ మేరకు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌సి ఓటర్ల జాబితా తయారీకి సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సిఇఒ తెలిపారు. ప్రస్తుతం శాసనమండలిలో మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సిగా ఉన్న జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఉపాధ్యాయ ఎంఎల్‌సిలుగా ఉన్న కూర రఘోత్తం రెడ్డి, (మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్ -ఖమ్మం-నల్లగొండ) పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎంఎల్‌సిలను ఎన్నుకునే ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.

ఓటరు నమోదు ప్రక్రియ ఇలా…

పేర్ల నమోదుకు నోటిఫికేషన్ : సెప్టెంబర్ 30
ఓటరు నమోదుకు కటాఫ్ డేట్ : నవంబర్ 1
దరఖాస్తు చేసుకోడానికి తుది గడువు : నవంబర్ 6
ముసాయిదా ఓటర్ల జాబితా : నవంబర్ 23
అభ్యంతరాలు, ఫిర్యాదులకు చాన్స్ : నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు
ఫిర్యాదుల పరిష్కరించేందుకు తుది గడువు : డిసెంబర్ 25
ఎన్నికల జాబితా తుది పబ్లికేషన్ : డిసెంబర్ 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News