Monday, December 23, 2024

ఉద్యోగులకు డిఎ

- Advertisement -
- Advertisement -
ఈసీ గ్రీన్ సిగ్నల్

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం అనుమతి ఇచ్చింది. మూడు డిఎలు పెండింగ్‌లో ఉండగా ఒక డిఎ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగాయి. డిఎల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని, ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో డిఎల చెల్లింపు విధానాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. డిఎ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీని కోరాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలింగ్ ముగిసిన అనంతరం ఉద్యోగుల డిఎ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ స్నిగల్ ఇచ్చింది. ఒక డిఎ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News