- Advertisement -
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ సంఘటనపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈనెల 14న ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనేక చోట్ల రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. రిగ్గింగ్‌కు సంబంధించిన ఒక వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఆర్మీ సెంటర్‌లో ఒక వ్యక్తి బ్యాలెట్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న దృశ్యం వీడియోలో రికార్డయింది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి విచారణ జరిపేందుకు వీలుగా కేసు నమోదు చేయాల్సిందిగా పితోరా ఘర్ పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ తరఫున రాతపూర్వక ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించింది.
EC Initiate case on Rigging in Uttarakhand Polls
- Advertisement -