Friday, January 24, 2025

ఎపి పిసిసి చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఎపిలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. షర్మిల తన ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైసిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇసికి ఫిర్యాదులు అందాయి. షర్మిలపై వైసిపి నేతలు మల్లాది విష్ణు, అవినాష్‌రెడ్డి, వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం. షర్మిలకు నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఇసి హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News