Monday, November 18, 2024

లోక్‌సభ ఎన్నికలకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అక్కడ నామినేషన్ ప్రక్రి య బుధవారం మొదలైంది. ఆ స్థానాలలో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికలు జ రగనున్నాయి. రాష్ట్రపతి తరఫున ఎన్నిక ల కమిషన్ (ఇసి) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ పత్రాల దాఖలుకు చి వరి తేదీ ఈ నెల 27. అయితే, ఒక పం డుగ కారణంగా బీహార్‌లో మొదటి దశ ఎ న్నికలు జరగనున్న లోక్‌సభ సీట్లకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 28. బీ హార్‌లోని 40 సీట్లలో నాలుగింటికి మొదటి దశలో వోటింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 28న జరుగుతుం ది.

బీహార్‌లో మాత్రం 30న నామినేషన్ ప త్రాలు పరిశీలిస్తారు. నామినేషన్ ప త్రాల ఉపసంహరణకు చివరి తేదీ 30, కా గా బీహార్‌లో అందుకు గడువు ఏప్రిల్ 2. 18వ లోక్‌సభకు ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలవుతాయి. తదుపరి దశలు 26, మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీలలో జరుగుతాయి. వోట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహిస్తారు. మొ దటి దశలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్,మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్,తమిళనాడు,యుపి, పశ్చిమ బెం గాల్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి లలో పోలింగ్ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News