Monday, January 20, 2025

అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కెటిఆర్, గోరంటి ఇంటర్వూపై డిజిపికి ఈసి లేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చివరి చేరుకోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్‌పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలను వేగం చేసి తన వద్దకు వస్తున్న ఫిర్యాదులను విచారించి సదరు అభ్యర్థుల నుంచి వివరణ కోరుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ నాయకులు నిరంజన్ ఈనెల 16, 22వ తేదీల్లో మంత్రి కెటిఆర్‌పై ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది.

అమరుల స్మారకం వద్ద కెటిఆర్, ఎమ్మెల్యే, గాయకుడు గోరంటి వెంకన్న ఇంటర్వ్యూ విషయంపై డిజిపి అంజనీ కుమార్‌ వివరణ ఇవ్వాలని సిఈఓ వికాస్ రాజ్  కోరారు. అదే విధంగా డిజిపికి ఈసి లేఖ రాశారు. ఇంటర్వ్యూ నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారో పూర్తి వివరాలను వీలైనంత తొందరగా పంపించాలని ఆదేశించారు. డిజిపి ఇచ్చిన వివరణ అనంతరం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News