Tuesday, December 24, 2024

అనుమనాస్పద బ్యాంకు లావాదేవీలపై ఈసీ నిఘా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బ్యాంకుల్లో రోజువారీ భారీ మొత్తంలో అనుమానాస్పదంగా సాగే లావాదేవీలపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టినట్టు కర్ణాటక లోని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్నిబ్యాంకులు అనుమానాస్పద లావాదేవీలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాల్లోని ఎన్నికల డిప్యూటీ కమిషనర్లకు ఈ సమాచారం అందించాలని సూచించారు.

అనేకసార్లు ఒకే పెద్ద మొత్తాలు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగితే ఆ లావాదేవీలను అనుమానించవలసి వస్తుందని, అలాంటి ఖాతాలపై బ్యాంకులు కన్నేసి ఉంచాలని మీనా చెప్పారు. కొత్త మార్గాల్లో నగదు పంపిణీ జరిపించడానికి ప్రయత్నించినా ఆధునిక వ్యవస్థల ద్వారా పసిగట్టడమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News