- Advertisement -
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఓటింగ్ మెషిన్లపై (ఈవిఎంలు) కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం(ఈసి) స్పష్టీకరణ ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ ఆదివారం డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఈవిఎంల దుర్వినియోగం జరిగిందన్నది తన అభిప్రాయం అని కూడా కపిల్ సిబాల్ అన్నారు.‘‘ ఈవిఎం గురించి అంత బాగా తెలియదు నాకు. కానీ కాంగ్రెస్ లేవనెత్తే ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ ఇవ్వాలి. ఈవిఎం ల దుర్వినియోగం జరిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది ఎంత మేరకు దుర్వినియోగం జరిగిందన్నది నాకు తెలియదు’’ అని కపిల్ సిబాల్ అన్నారు.
- Advertisement -