Friday, November 22, 2024

బిజెపికి ఈసి నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ను ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం బిజెపి కి నోటీసు ఇచ్చింది. విచ్ఛినకర, ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లోని బాన్స్ వాడాలో ఇచ్చారు.దానిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దానిపై ప్రతిస్పందించాల్సిందిగా ఎన్నికల సంఘం గురువారం బిజెపిని కోరింది. అదే సమయంలో బిజెపి దాఖలు చేసిన ఫిర్యాదుపై ప్రతిస్పందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్నికల సంఘం కోరింది.

బాన్స్వాడాలో ఏప్రిల్ 21న మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) దాఖలు చేసిన ఫిర్యాదుపై ప్రతిస్పందించాలంటూ ఎన్నికల సంఘం బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కు లేఖ రాసింది. ఇంకా ‘ప్రవర్తనా నియమావళి విషయంలో స్టార్ క్యాంపనైర్లందరూ ఉన్నత ప్రమాణాలను కాపాడాలి’ అంటూ కోరింది.

ప్రధానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును స్వీకరించి ఎన్నికల సంఘం ప్రతిస్పందించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

మోడీ తన ప్రసంగంలో  ‘‘కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్ తో చేతులు కలిపిందని, పైగా ఆస్తుల సర్వే, సంపద, మంగళ సూత్రం సహా బంగారంపై కూడా సర్వే చేయిస్తామని, సంపదను ముస్లింలకు పున:పంపిణీ చేస్తామని అంటోంది. ప్రతిపక్షం మహిళల మంగళ సూత్రాన్ని కూడా వదిలిపెట్టేలా లేదు’’ అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ‘ దేశ వనరులు మైనారిటీలకు ముందు అందే హక్కు ఉండాలి’ అన్నారని కూడా మోడీ తన ప్రసంగంలో గుర్తుచేశారు.

మోడీ తన ప్రసంగంలో ‘‘  మీరు వారిని ఎన్నుకునే విషయం మాట్లాడుతున్నారు. వారేమో తమ మేనిఫెస్టో లో బంగారం తీసేసుకుని, అందరికీ పంచిపెడతాం అన్నారు. ఇదివరలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు దేశ సంపదపై తొలి అధికారం ముస్లింలదే అన్నారు. ఈ సంపదను ప్రోగు చేసి ఎవరికిస్తారు? ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలున్నారో వారికి…దేశంలోకి చొరబడిన వారికి. మీ కష్టార్జితం దేశంలోకి చొరబడినవారికి ఇస్తారట…మీకు సమ్మతమేనా…’’ అంటూ కొనసాగించారు.

తమిళనాడులోని కొయంబత్తూర్ లో రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ పై చేసిన ఆరోపణలపై కూడా ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది. తనని రాముడి గుడి ప్రారంభోత్సవానికి పిలువలేదని, కారణం తాను ఎస్సీ కనుక అని అన్న ఖర్గేకు కూడా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన నోటీసు పంపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News