Monday, December 23, 2024

రణ్దీప్ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం నోటీసు !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ హేమా మాలినిపై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకుడు రణ్దీప్ సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. బిజెపి షేర్ చేసిన వీడియోలో సూర్జేవాలా ‘‘ప్రజలు తమ ఎంపీ/ఎంఎల్ఏ లను ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజా గళాన్ని వారు వినిపిస్తారని. నాకడానికి ఎన్నుకున్న హేమా మాలినిలా కాదు’’ అన్నారు. కాగా సూర్జేవాలా దీనిని ఖండించారు. బిజెపి ఐటి సెల్ మార్చి వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పెట్టిందన్నారు. ‘‘హేమాజీ అంటే మాకెంతో గౌరవం, ఆమె ధర్మేంద్ర జీని వివాహం చేసుకున్నారు. ఆ లెక్కన ఆమె మాకు కోడలితో సమానం’’ అని స్పష్టం చేశారు.

సూర్జేవాలా చేశారన్న వ్యాఖ్యలపై హేమా మాలిని స్పందించారు. ‘‘పేరు ప్రఖ్యాతులున్న వారిని కాంగ్రెస్ లక్ష్యం చేసుకుంటోంది. పేరుప్రఖ్యాతులున్న వారిని తక్కువ చేయడం వల్ల వారికేమి మేలు జరుగదు. వారు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధాని మోడీ నుంచి నేర్చుకోవాలి’’ అని మథురా ఎంపీ అయిన హేమా మాలిని అన్నారు.

సూర్జేవాలి అన్న వీడియో సంగ్రహాన్ని ఎన్నికల సంఘం షేర్ చేస్తూ ‘‘ ఆయన వ్యాఖ్యలు అమర్యాదగా, అసభ్యంగా  ఉన్నాయి. అవి శ్రీమతి హేమా మాలినిని అవమానించే విధంగానే కాదు, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కించ పరిచే విధంగా ఉన్నాయి. అంతేకాక ఓ పార్లమెంటు సభ్యురాలి గౌరవాన్ని, హుందాతనాన్ని, ప్రజా జీవితంలో ఉన్న మహిళను, మహిళలను అగౌరవపరిచేదిగా ఉంది’’ అని పేర్కొంది.

హేమా మాలిని ఉత్తర్ ప్రదేశ్ లోని 80 నియోజకవర్గాల్లో ఒకటైన మథుర నుంచి వరుసగా మూడో సారి పోటీచేయబోతున్నారు. ఆమె పోటీ చేసే లోక్ సభ ఏడో దశ ఎన్నిక ఏప్రిల్ 26న జరుగనున్నది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది. నర్తకి, నటి, ఇద్దరు పిల్లల తల్లి, పార్లమెంటు సభ్యురాలు అయిన హేమా మాలినిపై వ్యాఖ్యానించేప్పుడు కాంగ్రెస్ నేత సూర్జేవాలా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఉంటే బాగుండేది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News