రాంచీ: ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరెన్ ఎంఎల్‌ఎ అభ్యర్థిత్వం రద్దుపై ఎలక్షన్ కమిషన్ (ఈసి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలిపాయి. ఝార్ఖండ్ గవర్నర్ ఆదేశం మేరకు ఎన్నికల సంఘం హేమంత్ సొరెన్ అనర్హతకు సంబంధించి చర్యలు ప్రారంభించిందన్నారు. ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా వ్యక్తిగత పొడిగించారు. ఎంఎల్‌ఎగా హేమంత్ సొరెన్ ఈ విధంగా లబ్ధిపొందడం నిబంధనలకు విరుద్ధం. దీంతో సిఎంగా ఉన్న ఎంఎల్‌ఎ పదవిపై ఈసి అనర్హత వేటును ఎదుర్కొనున్నారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951సెక్షన్ 9 (ఎ) ప్రకారం హేమంత్ సొరెన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఈ కేసులో పిటిషనర్ బిజెపి పేర్కొంది. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారం.. ఎమెల్యేగా ఉన్న వ్యక్తి ప్రభుత్వ కాంట్రాక్టుల్లోగానీ లేదా ప్రభుత్వానికి వస్తువులను సరఫరాచేసే వర్తక, వాణిజ్య సంస్థలను నిర్వహించకూడదు. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన సంస్థల్లో భాగస్వామిగా లబ్ధిపొందడం నిబంధనలను ఉల్లంఘించడమే.
ఎమ్మెల్యేగా పదవీకాలంలో ఉన్నవారు ఆవిధంగా చేస్తే ఈసి అనర్హుడిగా పరిగణిస్తుంది. ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ పదవిలో ఉండగానే హూహూకమ కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఈసి చర్యలు చేపట్టింది. సొరెన్ అనర్హతవేటుపై ఈసి అభిప్రాయాన్ని గవర్నర్ రమేశ్ పరిశీలిస్తున్నారని, తరలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సొరెన్‌కు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హేమంత్ సోరెన్ భవిష్యత్ కార్యాచరణపై రాజ్యాంగ నిపుణులతో సంప్రతింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఝార్ఖండ్ ముక్తి మోర్చా యుపిఎ కూటమిలో భాగంగా జెఎంఎంతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలు సొరెన్ 2024వరకు ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.