Monday, December 23, 2024

కెసిఆర్ వాహనాన్ని చెక్ చేసిన ఈసి అధికారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట్ కు ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి వెళుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వాహనాన్ని ఎన్నికల అధికారుల మార్గమధ్యంలో ఆపి తనిఖీ చేశారు. మే 13న రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గస్తీలో భాగంగా కెసిఆర్ వాహనాన్ని అధికారులు చెక్ చేశారు. కెసిఆర్ ఆదివారం ఉదయం జనగామ జిల్లా లోని ఎర్రవెల్లి నుంచి ధరావత్ తండాకు తన ప్రయాణాన్ని మొదలెట్టారు.

బాధిత రైతులను కలుసుకుంటామని బిఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. అంతేకాక రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పై పోరాటం చేస్తామని కూడా ప్రకటించింది. కెసిఆర్ తుంగతుర్తి , సూర్యాపేట్ లోని అర్వపల్లిలో పర్యటించబోతున్నారని మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట్ క్యాంపస్ లో బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ విలేకరుల సమావేశం కూడా నిర్వహించనున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News