Wednesday, January 22, 2025

రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశం

- Advertisement -
- Advertisement -

EC order to register FIR against Raja singh

హైదరాబాద్ : బిజెపి పార్టీ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం, మీడియాతో మాట్లాడే విషయంలో కూడా రాజాసింగ్‌పై ఈసీ నిషేధం విధించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్‌కు మద్దతుగా రాజాసింగ్ విడుదల చేసిన వివాదస్పద వీడియోపై ఇప్పటికే ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వీడియో సందేశంపై వివరణ ఇవ్వాలని సూచించింది. విధించిన గడువు లోపల వివరణ ఇవ్వకపోవటంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌కు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. రాజాసింగ్ తన వీడియోలో ఓటర్లను బెదిరించినట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News