Saturday, February 22, 2025

పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణకు ఈసీ ఆదేశం

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. నిన్న(మంగళవారం) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి తనను గెలిపించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించారు. ‘ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా. లేకపోతే 4వ తేదీన నా శవయాత్రకు రండి’ అంటూ ఓటర్లను బెంబేలెత్తించారు. ‘మీ కాళ్లు పట్టుకుంటా ఒక్కసారి అవకాశం ఇవ్వండి’ అంటూ వేడుకున్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన ఈసీ… కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక పంపించాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News