- Advertisement -
అమరావతి: పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి జవహర్ రెడ్డి, డిజిపి హరీశ్ కుమార్ గుప్తాకు ఇసి సమన్లు జారీ చేసింది. పోలింగ్ తరువాత హింసాత్మక ఘటనలపై ఇసి వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇసి ఆదేశాల మేరకు రేపు సిఎస్, డిజిపి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎపి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన మరుసటి రోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్నాడులో టిడిపి- వైెసిపి కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడంతో పోలీసులు 114 సెక్షన్‌ను విధించిన విషయం తెలిసిందే. చంద్రగిరి, తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడి ఇరువర్గాలను చెదరగొట్టి 144 సెక్షన్‌ను విధించారు.
- Advertisement -