Thursday, January 23, 2025

రష్యాపై యూరోపియన్ కమిషన్ అదనపు ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

బ్రస్సెల్స్(బెల్జియం): ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై యూరోపియన్ కమిషన్ బుధవారం తొమ్మిదో విడత ఆంక్షలను ప్రతిపాదించింది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ “రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ తొమ్మిదో ప్యాకేజి శాంక్షన్స్ విధిస్తున్నాం’ అని తెలిపింది. “ఉక్రెయిన్‌లో రష్యా చంపివేతలు, విధ్వంసం కొనసాగిస్తోంది. కావాలనే పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్షం చేసుకుంటోంది. చలికాలం ఆరంభంలో ఉక్రెయిన్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటోంది. మేము ఉక్రెయిన్‌కు అండగా నిలబడ్డాము. ఈ క్రూరత్వానికి రష్యా మూల్యం చెల్లించక తప్పదు” అని ఉర్సులా తన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

రష్యా సాయుధ బలగాలు, రక్షణ పరిశ్రమ కంపెనీలు, రష్యా స్టేట్ డుమా, ఫెడరల్ కౌన్సిల్ సభ్యులు, మంత్రులు, గవర్నర్లు సహా మరో 200 మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలను యూరోపియన్ కమిషన్ విధించబోతున్నది అని ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు. మరో మూడు రష్యా బ్యాంకులపై కూడా యూరోపియన్ కమిషన్ ఆంక్షలు విధిస్తోందని ఆమె అన్నారు. రష్యా వస్తువులపై దిగుమతి ఆంక్షలు కూడా యూరోపియన్ కమిషన్ విధించబోతున్నట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News