Thursday, January 23, 2025

రాజకీయ పొత్తులను నియంత్రించలేం: ఈసీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజకీయ పొత్తులను నియంత్రించడానికి ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఎన్నికల కమిషన్ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనే వ్యూహంతో 26 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పేరును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు దేశం పేరును ఉపయోగించుకుంటున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఆ కూటమి ‘ఇండియా ’ పేరును వినియోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు… ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యం లోనే ఈసీ సోమవారం కోర్టుకు తమ స్పందన తెలియజేసింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రాజకీయ కూటములను చట్టపరమైన సంస్థలుగా పరిగణించలేం. అందువల్ల వాటి పనితీరును నియంత్రించడానికి చట్టపరమైన నిబంధన ఏదీ లేదు” అని ఈసీ తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News