Friday, January 31, 2025

కేజ్రీవాల్‌కు ఈసీ సూచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యమునా నదిలో అమోనియా స్థాయిలు పెరగడాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. హర్యానా ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఈసీ జారీ చేసిన నోటీసులకు ఆయన సమాధానమిచ్చారు. దీనిపై తాజాగా ఈసీ ప్రతిస్పందించింది. యమునా నదిలో అమోనియా పెరుగుదలను నరమేథం, రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని ఈసీ కేజ్రీవాల్‌కు సూచించింది. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడంతోపాటు అశాంతిని కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. పెరిగిన అమోనియా స్థాయిలను విషప్రయోగం అనే అంశంతో కలపకుండా .. నది లోని నీటి స్వభావం, పరిణామం విషపూరితమైన విధానం, దాన్ని గుర్తించే పద్ధతులపై సరైన సాక్షాలను అందించేందుకు మరో అవకాశం కల్పించింది. శుక్రవారం ఉదయం 11గంటల లోపు ఆయా సాక్షాలను ఢిల్లీ జల్‌బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News